Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రండి కదలిరండి కర్షక,కార్మిక అన్నలారా

రండి కదలిరండి కర్షక,కార్మిక అన్నలారా

రండి కదలిరండి కర్షక,కార్మిక అన్నలారా

ఈనెల 12వ తేదీన మనకోసం జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం…

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము…

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులతో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ. ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. మనదేశంలో కొన్ని దశాబ్దాల క్రితం కార్మికులు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పోరాడి సాధించుకున్న చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు వాటిని విభజించి కార్మికుల హక్కులను కాల రాయాలని చూస్తున్నాడని, పని భారాన్ని పెంచుతున్నాడని, అదేవిధంగా మన దేశానికి ఆహార ధాన్యాలు పండించి పెట్టే రైతులను రైతుల యొక్క హక్కులను కాలరాశి రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసి కార్పోరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పజెప్పి వారి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్న నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను మన పల్నాడు జిల్లాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఈ సమ్మెను విజయవంతం చేయాలని రాము రైతులకు కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముట్లూరి బాలస్వామి, కాకర్ల పెద్దారావు, అశోక్, ఏడుకొండలు, సైదులు, లక్ష్మణరావు, వాసు, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, నాగేశ్వరావు, మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.(Story : రండి కదలిరండి కర్షక,కార్మిక అన్నలారా )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments