Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు తిరిగి అమలు చేయాలి.

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి,

రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరను చట్టబద్ధత చేయాలి.

న్యూస్ తెలుగు/వినుకొండ : ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ వినుకొండ పట్టణంలోని శివయ్య భవనంలో బుధవారం జరిగిన వామపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ట్రేడ్ యూనియన్ నాయకులు మారుతి వరప్రసాద్, కె. హనుమంత రెడ్డి, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు . కేంద్ర ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది మొదలుకొని గత ప్రభుత్వాలు సాధించి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అంబానీ అధానీలకు దోచిపెడుతున్నారని సంపద సృష్టిస్తున్న కార్మికులు కష్టజీవులు రైతు రైతులు రైతు కూలీలకు జీవన పరిస్థితులు దయనీయంగా మారుతుంటే వారి జీవన పరిస్థితులు మెరుగుపరచవలసిన కేంద్రం పబ్లిక్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ బడా పెట్టుబడిదారులకు భూములను ప్రభుత్వ రంగ పరిశ్రమలను వారు చౌకగా ధారా దత్తం చేస్తున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఇప్పటివరకు లక్ష అరవై వేల మంది రైతాంగం ఆత్మహత్యల పాలయ్యారని వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తే సంవత్సరం పైబడి రైతాంగం విరోచిత సమ్మె పోరాటం చేసిందని ఫలితంగా చట్టాలను రద్దు చేసుకున్నానని నరేంద్ర మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని రైతులకు రైతు సంఘాలకు వ్రాత పూర్వకంగా హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని కార్మికులపై ఉక్కు పాదం మోపి కార్మిక చట్టాలను కాలరాసి లేబర్ కోడ్లను అమలు చేస్తుందని ఫలితంగా కార్మికులు యూనియన్లు పెట్టుకోవడానికి వీలులేదని కష్టానికి తగ్గ ఫలితాన్ని వేతనాలను కూలి రేట్లను పెంచమని అడిగే హక్కు లేదని కార్మికులకు సమ్మె చేసే హక్కులను తొలగించారని ఫలితంగా పెట్టుబడిదారీ వర్గానికి శ్రమ దోపిడీ రోజుకు 12 గంటలు పని విధానాల అమలు చేసి శ్రమ దోపిడీ కి మార్గం సుగమం చేసిందని కార్మికుల జీవితాలు అనారోగ్యాల పాలై ప్రశ్నించే హక్కుని సమ్మె చేసే హక్కుని వేతనాలు పెంచే హక్కుని పూర్తిగా కోల్పోతారని వారు కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో అధిక ధరలు పెరిగిపోయాయని మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల లో సామాన్యుడు వాడుకునే సరుకులు పెట్రోలు, బీజీలు గ్యాస్ రేట్లు మూడు రెట్లు విరిగిపోయాయని సామాన్య ప్రజల జీవితాలు కకావికులై పోతున్నాయని విమర్శించారు. సోమవారం నాడు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ కు సవతి తల్లి ప్రేమ చూపారని విభజన హామీల మేరకు చట్టప్రకారం రావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చలేదని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని నియంత పాలన కొనసాగిస్తున్నదని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారన్నారు. వినుకొండ నియోజకవర్గం లోని పల్నాడు జిల్లాలోని కార్మిక వర్గం రైతు వర్గం ప్రజానీకం ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా నియంతృత్వ బిజెపి ప్రభుత్వానికి సరియైన బుద్ధి చెప్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకా వివిధ కార్మిక సంఘాల నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము బొంకూరు వెంకటేశ్వర్లు సురేష్ రాజా ఆంజనేయులు షేక్. మస్తాన్వలి, షేక్ ఫిరోజ్, మునగపాటి ప్రసాద్, బత్తుల వెంకట్రావు, కే మల్లికార్జునరావు బాలకోటిరెడ్డి సంపెంగుల అబ్రహం రాజు యేసు పాదం తదితరులు పాల్గొన్నారు.(Story : ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!