విషహారం తిని మతి స్థిమితం లేని వ్యక్తి మృతి
కుటుంబం లో నలుగురు పిల్లలు
మరో కుటుంబంలో ఇద్దరికీ అస్వస్థత
భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స లు

న్యూస్ తెలుగు -చింతూరు : పోలవరం జిల్లా చింతూరు మండలంలోని ఇరకంపేట గ్రామంలో గత రాత్రి మతిస్థిమితం లేని మడకం కోసయ్య అనే వ్యక్తి తినే అన్నం లో పురుగు మందు కలిపి అన్నం తిన్నాడు. అతని కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన గత రాత్రి ఏడుగు రాళ్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం ఇలా ఉండగా మృతి చెందిన కోసయ్య మిగిలిన అదే అన్నం లో కూడా విషం కలపటంతో కుటుంబంలో విషయం తెలియని కోసయ్య చెల్లి అయితమ్మ(43), ఆమె కుమార్తె లక్ష్మి(8), మృతిచెందిన కొసయ్య నలుగురు పిల్లలు స్వప్న(7) సంజన(6), మరియమ్మ(5) మాధురి(2) విషయం తెలియని వీరంతా విషం కలిపిన అన్నం తిన్నారు. అర్ధరాత్రి వీరందరికీ అస్వస్థత కలగటంతో ప్రధమంగా ఏడుగురాళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్సలు నిర్వహించిన అనంతరం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భద్రాచలంలో వైద్యుల పర్యవేక్షణలో వారికి రాత్రి నుండి చికిత్స లు నిర్వహించటంతో మృత్యువును జయించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై చింతూరు సిఐ గోపాలకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (Story:విషహారం తిని మతి స్థిమితం లేని వ్యక్తి మృతి)

