శబరి నదిలో వ్యక్తిగల్లంతు
న్యూస్ తెలుగు/చింతూరు : శబరి నదిలో చింతూరు బీసీ కాలనీకి చెందిన ఒక వ్యక్తి శబరి నది లోపడి గల్లంతయ్యాడు. చింతూరు బీసీ కాలనీ లో నివసిస్తున్న చల్లా కృష్ణమూర్తి కుమారుడు వెంకటరమణ, ఎర్రం ఆనందరావు కుమారుడు వెంకట దుర్గాప్రసాద్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సాయంత్రం శబరి నదిలో స్నానానికి వెళ్లారు. ఎయిర్టెల్ టవర్ వద్ద బండలు ప్రాంతంలో దిగడంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దిగడంతో వెంకటరమణ శబరి నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ విషయం గూర్చి ఎస్ఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.(Story : శబరి నదిలో వ్యక్తిగల్లంతు )

