Homeవార్తలుతెలంగాణపదిమంది అవినీతిపరులను ఓడించండి

పదిమంది అవినీతిపరులను ఓడించండి

పదిమంది అవినీతిపరులను ఓడించండి

న్యూస్ తెలుగు/వనపర్తి : పదిమంది అవినీతిపరులను ఓడించండి అని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పేర్కొన్నారు. 28వ వార్డు, ఐదవ వార్డు, 13వ వార్డు సందర్శించిన అనంతరం డా” సతీష్ యాదవ్ మాట్లాడుతూ, అనువైన చోట అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు పోటీ చేస్తారనీ. మున్సిపాలిటీలో అవినీతి అంతం చేయడానికి దేనికైనా సిద్ధమని, అవసరమైతే ఏ త్యాగానికైనా నేను సిద్ధమని తెలిపారు. ఒక ప్రశ్నించే గొంతుక మాట్లాడితే, అవినీతిపరులు అదిరిస్తారు, బెదిరిస్తారు, అవసరమైతే దాడి చేస్తారు… అయినా సరే పుట్టిన వూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏ త్యాగానికైనా సిద్ధమని, చెప్పిన మాట నెరవేరితే చాలని తెలిపారు. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల తర్వాత నామినేషన్ వేసే అభ్యర్థులను బట్టి నిర్ణయాలు తెలుపుతామని, అంతవరకు ప్రజలతో మమేకమై వనపర్తికి ఎవరు కీడు చేశారు, ఎవరు దోచుకున్నారో తగు సాక్షాలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, బత్తిని మధు, రామస్వామి, నాగరాజు, రమేష్, జక్కుల రాములు, వెంకటస్వామి, రమేష్ నాయక్, మన్యం నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story : పదిమంది అవినీతిపరులను ఓడించండి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!