ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం
తొలి ఏకాదశి నాటికి 90% ఆలయ నిర్మాణ పనులు పూర్తి.
11 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : సీతమ్మ జాడను విన్న కొండ చారిత్రాత్మక కథను ప్రతి చిహ్నంలో చూస్తూ ఆలయ ప్రకారం నుండి గర్భగుడి వరకు భక్తుడు దైవంతో ఏకమయ్యే విధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. సోమవారం కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను స్తపతి, దేవాదాయ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. దేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన శైవ క్షేత్రాలు కేతననాద్, కాలేశ్వరం, శ్రీకాళహస్తి, కాంచీపురం, తిరువన్నవాల్, అరుణాచలం, చిదంబరం, రామేశ్వరం పుణ్యక్షేత్రాల దిశలో 97.7 సమాంతర భౌగోళిక రేఖ దగ్గర వినుకొండ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందని తెలిపారు. సీతమ్మ జాడను జటాయువు ద్వారా రామచంద్ర ప్రభు వినటం వలన విన్న పండగ ప్రఖ్యాతి మంచిందని, సాక్షాత్తు రామచంద్ర ప్రభువు రామలింగేశ్వర స్వామి ప్రతిష్టించారని, ఆలయ నిర్మాణం అనంతరం దేశవ్యాప్తంగా ఆలయ ప్రసిద్ధి భావిస్తుందని యోగులు తెలిపినట్లు వివరించారు. అటువంటి పుణ్యక్షేత్రం పుడం నిర్మాణం మా హయాంలో సంకల్పించడం ఎంతో అదృష్టం అన్నాడు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు 4 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, కొండపైకి తారు రోడ్డు, డ్రైనేజీ కాలువ వివిధ అభివృద్ధి పనులకు 11 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేయడం జరిగిందని, త్వరలో నిధులు సమకూర్చి ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గత ఐదేళ్ల పాలనలో దేవాలయానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి నిధులు తీసుకురాలేని బ్రహ్మనాయుడు గుడి నిర్మాణానికి నిధుల అవసరం లేదని ప్రభుత్వానికి నివేదించడం అన్యాయం అన్నారు. ఘాట్ రోడ్డు, గుడి నిర్మాణానికి సిజిఎఫ్ పథకం ద్వారా నిధులు తీసుకురావడం జరిగిందని జూలై 25 తొలి ఏకాదశి పండుగ నాటికి 90% ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దేవాలయ నిర్మాణానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులతో పాటు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం )

