భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయాలి
సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు జి. సత్యవతి
న్యూస్ తెలుగు /సాలూరు : రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూసార పరీక్షలు చేయించి తగిన మోతాదులో ఎరువులు ఉపయోగించుకోవాలని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు జి సత్యవతి కోరారు. బుధవారం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో వ్యవసాయంపై సమగ్ర పోషక యాజమాన్య ప్రదర్శన క్షేత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై మూడు సాలూరు, పాచిపెంట మరియు మక్కువ మండల రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు మట్టి నమూనా ఫలితాలు ఆధారంగా జింకు లోపం ఉన్న భూమి యొక్క రైతులు కు మరియు వ్యవసాయ సహాయకులకు సబ్ డివిజన్ పరిధిలో రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగిందనీ తెలిపారు. రైతులు భూసార పరీక్షలు ఆధారంగా మాత్రమే వాడుకోవాలని నేల సారం పెంచుకోవాలని, భాస్వరం ఎరువు ఎట్టి పరిస్థితుల్లోని జింకుతో కలిపి ఈవేయకూడదని తెలిపారు, ప్రతి మూడు పంటలకు 20 కేజీ ల జింక్ సల్ఫేట్ ఒక ఎకరా కు వేసుకోవాలని అన్నారు.వరి మరియు మొక్కజొన్న పంటల్లో ఎరువులు యాజమాన్యం పద్ధతులు వ్యవసాయం చేయలని తెలిపారు.ఏ ఎం సి
చైర్మన్ , సూర్యనారాయణ మాట్లాడుతూ ఎరువులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. అలాగే వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు పాటించి వ్యవసాయం చేయాలని కోరారు, అనంతరం రైతులకు ఉచితంగా జింక్ పంపిణీ చేయటం జరిగింది,
పాచిపెంట వ్యవసాయ అధికారి కె తిరుపతిరావు మాట్లాడుతూ సమతుల్య పోషకాలు పంటలకు అందించాలని , నవధాన్యాల ఆవశ్యకత గురించి తెలిపారు,ఈ కార్యక్రమంలో సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష , మక్కువ వ్యవసాయ అధికారి భారతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.(Story:భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయాలి)

