రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా, వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రీసర్వే పూర్తయిన రైతులకు, ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు. రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని, రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అండగా ఉంటాయని జీవి తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ. మీ భూమి మీ హక్కు నినాదంతో సొంత భూములకు పూర్తిహక్కలు కలిపిస్తున్నదని జీవి అన్నారు. రీ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేడు 21,86,000 మందికి పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 97 వేల 125 మందికి, వినుకొండ నియోజకవర్గంలో 39 వేల ఆరు వందల మందికి, నీల గంగవరం గ్రామంలో 700 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అంటూ పుస్తకాలపై జగన్ ఫోటో వేయించుకొని రైతుల్లో అభద్రత భావాన్ని కలిగించాలన్నారు. నేడు భూ హక్కుదారులకు పూర్తి రక్షణ కలిగిందన్నారు. అలాగే వారసత్వ హక్కు భూములు వారి పిల్లలకు కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. 22 ఏ తొలగించడం జరిగింది అన్నారు. కాగా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు 13 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు . ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ , నిశ్శంకర్ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన )

