విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం
న్యూస్ తెలుగు/వినుకొండ : విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వినుకొండ పట్టణం 1వ వార్డు పరిధిలోని కళ్యాణపురి కాలనీ మరియు సిద్ధార్థ నగర్లలో సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 KV 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, నూతన విద్యుత్ లైన్లను ఆయన ప్రారంభించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా రూ.16 లక్షలతో అత్యాధునిక ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. గత పాలకుల హయాంలో విద్యుత్ రంగం కుదేలైందని, సామాన్యులపై భారాలు మోపుతూ గతంలో పలుమార్లు కరెంట్ బిల్లులను విపరీతంగా పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ , నిశ్శంకర శ్రీనివాసరావు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం)

