కోళ్ల వెంకటేష్ వికసిత్ భారత్ ట్రస్ట్
న్యూస్ తెలుగు/వనపర్తి : ఆధ్వర్యంలో నూతన 2026 సంవత్సరం సందర్భంగా ట్రస్ట్ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోళ్ల వెంకటేష్ మాట్లాడుతూ.1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది.అదేవిధంగా 2047 సంవత్సర నాటికి భారత్ అనిత అభివృద్ధిలో వికసించాలని ప్రథమ స్థాయిలోకి ఎదగాలని, ఉజ్వలమైన భవిష్యత్తుగా భారతదేశం ఎదగాలని,ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో కూడా మొదటి స్థానానికి రావాలని ఆకాంక్షించారు అందుకోసం ప్రతి వ్యక్తి మానవతా ధర్మంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులను ఆదుకొనుటకు ముందుకు రావాలని కోరారు. ఆర్తులు అనాధలు, వృద్ధులు వితంతువులు తల్లిదండ్రులు లేని చిన్న పిల్లలను మానవతా ధర్మంతో ఆదుకోవాలని.వారికి అక్షరాస్యత కూడా నేర్పించాలని, విద్యాపరంగా మరియు ఆరోగ్యపరంగా పేదలకు చేత నివ్వాలని మానవులుగా మనందరం చేయాల్సిన విధి అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఉజ్వలంగా ఎదగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నటువంటి వికసిక్ భారత్ లో మనం కూడా అంతర్భాగం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు నితీష్ పటేల్,రవి యాదవ్, వినోద్ యాదవ్, సత్యం యాదవ్, బాలేమియా, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.(Story : కోళ్ల వెంకటేష్ వికసిత్ భారత్ ట్రస్ట్ )

