ఉచిత బియ్యానికి రు 150. ఖర్చు పెట్టాల్సి వస్తుంది
గిరిజనుల ఆవేదన

న్యూస్ తెలుగు /చింతూరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తో నడిపే ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని చింతూరు మండలం లోని, ఏడుగురాళ్లపల్లి గ్రామపంచాయతీలో, చదలవాడ గ్రామపంచాయతీలోనూ, కల్లేరు గ్రామపంచాయతీ లోను, కొత్తపల్లి తదితర గ్రామపంచాయతీలో నెట్వర్క్ లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లోని కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎవరైనా వేలిముద్రలు(తంబ్) వేసి రేషన్ తీసుకోవచ్చు. అయితే వరుసగా 3 నెలలు వేలిముద్ర ( థంబ్ ) వేసి బియ్యం తీసుకోకపోతే ఆ కార్డు రద్దు అవుతుందని ప్రభుత్వం నియమం పెట్టింది. ప్రభుత్వ నిర్ణయం మంచిదైనా ఏజెన్సీలోని గిరిజనుల పాలిటి శాపమైంది. గిరిజన కుగ్రామాలలో అదే గ్రామంలో రేషన్ ఇచ్చినా నెట్వర్క్ లేకపోవడంతో ఆయా గ్రామాల నుండి ఆటోలలో చింతూరు వచ్చి వేలిముద్రలు (థంబ్ ) వేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ద్వారా ప్రతి రేషన్ కార్డుకు 5 కేజీల నుండి 20 కేజీలు మాత్రమే రేషన్ వస్తుంది. అయితే రేష రేష ఐదు కేజీలు ఐదు కేజీలు వచ్చే కార్డుదారుడు, 20 కేజీలు వచ్చే రేషన్ కార్డు దారుడు కూడా 100 నుండి 150 రూపాయలు వరకు ప్రతినెల ఖర్చు చేయాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. బుధవారం మండలంలోని తులసిపాక గ్రామపంచాయతీ లోని చదలవాడ, గౌండ్లకోట, సౌలూరు, మిట్టవాడ, ఏరువాడ తదితర గ్రామాల నుండి చింతూరుకు వ్యయప్రయాసలుకోర్చి, ప్రతి ఒక్కరూ ఆటోలలో వచ్చి వేలిముద్రలు (థంబ్ ) వేయాల్సి వస్తుంది. ఆరోజు వందరోజుల పని మానుకొని ఐదు నుండి 20 కేజీలు బియ్యం కోసం చాలా ఇబ్బందులు పడి, డబ్బులు ఖర్చు పెట్టుకొని చింతూరు కి రావాల్సి వస్తుందని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు, సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ,ఇతర ప్రభుత్వ అధికారులు కల్పించుకొని నెట్వర్క్ లేని గ్రామాలలో ఆఫ్ లైన్ లో తమకు రేషన్ ఇప్పించాలని(బియ్యం) కోరుతున్నారు.
తహసిల్దార్ వివరణ.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో రేషన్ తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని చింతూరు వచ్చి వేలిముద్రలు ( తంబ్ ) వేయాల్సి వస్తుందని దీనిపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని న్యూస్ తెలుగు విలేఖరి స్థానిక తాసిల్దార్ ను వివరణ
కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు, జిల్లా ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపి వారి సూచనలు ప్రకారం డిపోలను నడిపిస్తామని తహసిల్దార్ సయ్యద్ హుస్సేన్ వివరణ ఇచ్చారు. (Story:ఉచిత బియ్యానికి రు 150. ఖర్చు పెట్టాల్సి వస్తుంది.)

