పి4 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, కమ్మవారిపాలెం ఎస్టి కాలనీ నందు ‘పి4’ కార్యక్రమం కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. పేదరిక నిర్మూలన మరియు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న పి4 కార్యక్రమం కింద ఎస్టి కాలనీలో దత్తత తీసుకున్న కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పి4 ద్వారా పేదలను తత్తత కార్యక్రమం చేపట్టారన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రతి కుటుంబానికి ప్రాథమిక అవసరాలు తీర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : పి4 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేసిన ప్రభుత్వ )

