ఆర్వో ప్లాంట్ యజమానులు నిబంధనలు పాటించాలి
మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్.
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దేశాలతో, వినుకొండ మున్సిపల్ చైర్ పర్సన్ సూచనలతో, స్థానిక పురపాలక సంఘ కౌన్సిల్ హాలు నందు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించిన మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వాహకుల సమావేశంలో పట్టణ పరిధిలో అందరూ మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులు పురపాలక సంఘం నుండి మరియు జిల్లా కార్యాలయాల నుండి అనుమతులు తీసుకొని మాత్రమే ప్లాంట్స్ నిర్వహించాలి, ఆర్వో ప్లాంట్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేల వాటర్ క్యాన్సును తరచు శుభ్రం చెయ్యాలి. వాటర్ క్యాన్స్ అన్నిటికీ మూతలు ఉండేలా చూడడం, ఫిల్టర్ బ్యాక్ వాష్ ను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చాల్సిందిగా కోరారు, టీడీస్ ను ప్రతి రోజు రిజిస్టర్ నందు నమోదు చేసుకోవాలి, రా వాటర్ టీడీస్ ప్రతి రోజూ చెక్ చేసి నమోదు చేయవలెను, మినరల్ వాటర్ టేస్ట్ కోసం కలుపుతున్న రసాయన లిక్విడ్ వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నందున ఆ లిక్విడ్ ను కలపకుండా చూడాలి, ప్రతి మూడు నెలలకు ఒకసారి లాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ను తప్పని సరిగా మున్సిపల్ కార్యాలయంకు అందజేయాలి, పరిశుభ్రమైన నీటి తో పాటుగా కాల్షియం, పొటాసియం, తదితర ఖనిజ లవణాలను తగు మోతాదులో కలిగి ఉన్న నీటిని మాత్రమే వినియోగ దారులకు అందించలన్నారు. పైన తెలిపిన అన్ని నియమాలను వారి ప్లాంట్ వద్ద బోర్డు నందు ప్రదర్శించాలన్నారు. ప్రజలందరూ అనుమతులు ఉన్న వారివద్ద నుండి మాత్రమే మినరల్ వాటర్ కొనుగోలు చేయవలసినదిగా సూచించారు. మున్సిపల్ సిబ్బంది తరచు వాటర్ ప్లాంట్స్ తనిఖీ చేసి నిబంధనలు పాటించాలని, ప్లాంట్స్ ను మూసి వేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆదినారాయణ, సానిటరీ సెక్రటరీలు, మేస్త్రులు, పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పాల్గొన్నారు.(Story : ఆర్వో ప్లాంట్ యజమానులు నిబంధనలు పాటించాలి )

