రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బి.టెక్ విద్యార్థులు యశ్వంత్ సాయి, వాసు కుటుంబ సభ్యులను సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ములకలూరు గ్రామం ఇళ్ల వద్దకు జీవి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల తన విచారం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ )

