Homeవార్తలుతెలంగాణరెవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాం

రెవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాం

రెవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాం

న్యూస్ తెలుగు/వనపర్తి ; మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలలో బాగంగా రెవెల్లి మండల కేంద్రంతో పాటు కొంకలపల్లి,బండ రవిపాకుల గ్రామాల బి.ఆర్.ఎస్ బలపరిచిన అభ్యర్థులు పబ్బతి.పర్వతాలు,పెద్దముక్కల.లక్ష్మీ,శ్రీరాములు తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రెవెల్లి ఒక మూలకు విసిరేసిన గ్రామములో ఉండేదని తాను ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులుగా,మంత్రిగా రెవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశామని అన్నారు. రెవెల్లినీ మండలం చేయడం, ఒక్క గజం భూమి కూడా ఎండకుండా సాగు,తాగు నీరు అందించామని కె.జి.బి.వి పాఠశాల,కళాశాల ఏర్పాటు చేశామని మండలానికి కావలిసిన అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు. చేసిన అభివృద్ధినీ కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆది వారి చేతకాని తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఊరి బయటి వరకు కోటి రూపాయలతో సి.సి డబల్ రోడ్ మంజూరు చేయిస్తే ఆది వేయడం మాని నిధులు కాంగ్రెస్ నాయకులు దారి మళ్లించారని విమర్శించారు. యూరియా కొరత,కరెంట్ కోతలు, మద్దతు ధర లేక,ధాన్యానికి బోనస్ లేక,రైతు భరోసా ఎగ్గొట్టడం,అసంపూర్తి రుణ మాఫీ, ఒక్క రైతు కూడా బీమా రాకపోవడంతో రైతులు దిక్కు లేని పక్షులల్లాగా అప్పుల పాలవుతున్నారని ఘాటుగా విమర్శించారు.బి. సిల పట్ల కపట ప్రేమ చూపి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేశారని ఆత్మాభిమానం కలిగిన బి. సి బిడ్డలను రోడ్ల పాలుజేసిందని వాపోయారు.
బి. సిలను చేసిన మోసాన్ని తట్టుకోలేక సాయి ఈశ్వారచారీ ఆత్మహత్య చేసుకున్నారని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.బి.సి బిడ్డలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని నిరుద్యోగులు ప్రభుత్వం తిరుగుబాటు చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని అన్నారు. ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళకు 2500,ఆసరా పింఛన్లు 4000,తులం బంగారం, నిరుద్యోగులకు భృతి,కె.సి.ఆర్ కిట్టు,విద్యార్థినులకు స్కూటీలు,విద్యార్థి బరోసా,బకాయి పడ్డ రైతు భరోసా,బకాయి పడ్డ బోనస్ ఇచ్చి ఓట్లకు రావాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండ్లలో బి.ఆర్.ఎస్ సర్కార్ వస్తుందని అభివృద్ధి జరగాలంటే బి.ఆర్.ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బోర్ల.భీమన్న,శివరామ్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,మాజీ ఛైర్మెన్ పలుస.రమేష్ గౌడ్ మరియు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : రెవెల్లి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!