సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’
హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కొన్ని పరిస్థితుల్లో హీరో ప్రేమను కోల్పోవటం, ఆ బాధ నుంచి బయటకు రావటం వంటి ఫీలింగ్స్‌ను ట్రైలర్లో చాలా చక్కగా చూపించారు. కథలోని డెప్త్, ప్రేమలోని తెలియని బాధలను కూడా ప్రేక్షకులు మెచ్చే రీతిలో తెరకెక్కించారు. కథను సినిమాగా తెరకెక్కించటంలో తన ప్రత్యేకతను చాటే దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ శైలి ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ను తన రైటింగ్ స్టైల్లోనే ఆయన ఆవిష్కరించాడు. ఇది సినిమాను మరింత గొప్ప సినిమాటిక్ జర్నీగా మార్చింది.
గుల్షన్ కుమార్, టి సిరీస్, కలర్ ఎల్లో సమర్పణలో రూపొందిన తేరే ఇష్క్ మై సినిమాను ఆనంద్ ఎల్.రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఆనంద్ ఎల్.రాయ్ సినిమాను తెరకెక్కించారు. హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ సినిమా రైటర్స్, ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం సమకూర్చగా ఇర్షద్ కమిల్ సాహిత్యాన్ని అందించారు. నవంబర్ 28 నుంచి ఈ సినిమా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. (Story:సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’)

