ఏకమైన మున్ననూర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్పేట మండలం మున్ననూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకమైంది గ్రామ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కుమారుడు వంగూరు స్వామి తన సర్పంచ్ నామినేషన్ను ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన వెంట గ్రామ యువకులు 20 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవమైన 6 వ వార్డు సభ్యుడు సోడే నరసింహను ఎమ్మెల్యే గారు శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు సత్యం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధీర మల్లు యాదవ్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రాజు, వెంకట్రాంరెడ్డి, కే రాములు, కే చంద్రయ్య, స్వామి, సురేష్, శివశంకర్ గౌడ్, బాలపీరు, రాజేశ్వర్ రెడ్డి, నరసింహ, హరీష్, మధు,కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story:ఏకమైన మున్ననూర్)

