బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
న్యూస్తెలుగు/వనపర్తి : ఘనపూర్ మండలం బాలలకు ఏదైనా సమస్య తలెత్తినప్పడు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు కాల్ చేయాలని చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రాజేష్ సూచించారు. మామిడిమాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1098 సేవలపై శుక్రవారం అవగాహన కల్పించారు. హింసా, దోపిడీ, బాలల అక్రమరవాణ రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంపై సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. జాతీయ సంపద అయిన చిన్నారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాలికలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాలు, భ్రూణహత్యల నివారణకు పాటుపడాలన్నారు. బాలల రక్షణే ధ్వేయంగా చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీపిఎస్ ఔట్ రీచ్ వర్కర్ నరేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెన్నప్ప ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story:బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత)

