విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వారి భవన ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీ.శే షేక్ ఖాసిం ( ఎన్ఎస్పి డ్రైవర్) జ్ఞాపకార్థం వారి ధర్మపత్నీ అమీనా బి మరియు కుమారుడు, కోడలు కాలేషావలి, నాగూర్ జాన్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. సంఘం యొక్క కార్యక్రమాల ను గూర్చి వివరిస్తూ సంఘ సభ్యులు మరియు దాతలు ఇతోదికంగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.వి సుబ్బయ్య శర్మ,ఎ. నాగేశ్వరరావు, అవ్వారు కోటేశ్వరరావు, ఎం వి శర్మ, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, రాము, బిపిఎస్ సుందర్రావు, హనుమంతరావు, వెంకటస్వామి, రాఘవయ్య, ఆది రాములు సుబ్రహ్మణ్యం, తదితరు పాల్గొన్నారు.(Story:విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)

