వైద్యరంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి కుటమీ ప్రభుత్వం ప్రయత్నం
మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
న్యూస్ తెలుగు /సాలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పప్పు బెల్లాలు పంచినట్లుగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు పంచుతున్నారని ఇటీవలే నియమితులైన అరకు పార్లమెంట్ ఉన్న సాలూరు, పార్వతీపురం,కురుపాం,పాలకొండ నియోజకవర్గాల వైసీపీ పరిశీలకులు శరగడం.చిన్నఅప్పలనాయుడు అన్నారు. గురువారం సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆయన నివాసంలో వైయస్సార్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను రాజన్న దొర ఆయనకు పరిచయం చేయడం జరిగింది. అనంతరం చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ రానున్నది మన జగనన్న ప్రభుత్వమే అని కార్యకర్తలు ఎవరు అధర్య పడవద్దు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడానికి ఆచరణ సాధ్యము కానీ హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలేదని అన్నారు. పేదవాడికి వైద్యం ఎంతో అవసరమని అలాంటి వైద్యరంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి ఈ కుటమీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. ప్రజలందరూ పార్టీ కార్యకర్తలతో కలిపి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజేసే ఎక్కువగా సంఖ్యలో సంతకాల నమోదు కార్యక్రమాన్ని చేయాలని అన్నారు. కమిటీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఉపముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారని వీరందరికీ రానున్న రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తలందరూ ఆ ధైర్యం పడకుండా రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో మన సత్తా చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సాలూరు పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, మండల అధ్యక్షుడు సువ్వాడ భరత్ శ్రీను, పాచిపెంట మండలం ఎంపీపీ బదనాన్న ప్రమీల, సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైయస్సార్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైయస్సార్ పార్టీ సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న సాలూరు(టౌన్,రూరల్), మక్కువ,పాచిపెంట,మెంటాడ మండలాల వైసిపి తాజా,మాజీ జడ్పిటీసీలు,ఎంపీటీసీలు, సర్పంచులు,ఉప సర్పంచులు, మండల వైసీపీ అధ్యక్షులు, వైసీపీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు,సభ్యులు పాల్గొన్నారు.(Story:వైద్యరంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి కుటమీ ప్రభుత్వం ప్రయత్నం)

