Homeవార్తలుతెలంగాణఎన్నికల భద్రతపై పోలీసుల భారీ "ఫ్లాగ్ మార్చ్‌ వనపర్తి సీఐ

ఎన్నికల భద్రతపై పోలీసుల భారీ “ఫ్లాగ్ మార్చ్‌ వనపర్తి సీఐ

ఎన్నికల భద్రతపై పోలీసుల భారీ “ఫ్లాగ్ మార్చ్‌ వనపర్తి సీఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి, జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా నియంత్రించడానికి వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు, వనపర్తి సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో గోపాల్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో పోలికపాడు, బుద్దారం, తాడిపర్తి, ఎదుట్ల, ఎదుల గ్రామాలలో మరియు రేవల్లి పోలీస్టేషన్ పరిధిలో, రేవల్లి, చెన్నారం, నాగపూరు, బండరావిపాకుల, తలుపునూర్, పోలీస్టేషన్ గ్రామాలలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఫ్లాగ్ మార్చ్ ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపు, చట్టాన్ని చేతులెత్తి చూపే వ్యక్తులకు కఠిన హెచ్చరిక, మరియు ప్రతి పౌరుడు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించేందుకు పోలీస్ ప్రత్యేక బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించామని సీఐ తెలిపారు.
సీఐ మాట్లాడుతూ… ఎన్నికల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం, ఎవరి భయానికి లేదా ప్రలోభానికి లొంగకుండా ప్రజలు ధైర్యంగా ఓటు వేయేలా చేయడం మా బాధ్యత. ఓటు కేవలం హక్కు కాదు ది బాధ్యత, ప్రజాస్వామ్య పునాది.” అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల్లో ఎలాంటి విఘాతం చోటుచేసుకోకుండా, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని వనపర్తి సీఐ కృష్ణయ్య తెలిపారు.ప్రజలు ఎలాంటి బెంగ లేకుండా తమ దైనందిన కార్యకలాపాలు అలాగే పోలింగ్‌లో పాల్గొనవచ్చు. ఎలాంటి చట్టవ్యతిరేక చర్యనైనా కఠినంగా అణచివేస్తామని అన్నారు. అదే విధంగా సీఐ గారు ప్రజలకు పిలుపునిస్తూ యువత, మహిళలు, వృద్ధులు అందరూ ఓటు వేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఆయుధాలు కాదు పౌరుల బాధ్యత ఓటు వేయండి గ్రామం బలపడుతుంది, ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణయ్య, గోపాల్ పేట్ ఎస్సై నరేష్, రేవల్లి ఎస్సై, రజిత, పోలీసుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story:ఎన్నికల భద్రతపై పోలీసుల భారీ “ఫ్లాగ్ మార్చ్‌ వనపర్తి సీఐ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!