Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైయస్సార్ పార్టీపై ఆరోపణలు చేయడం స‌రైన‌ పద్ధతి కాదు

వైయస్సార్ పార్టీపై ఆరోపణలు చేయడం స‌రైన‌ పద్ధతి కాదు

వైయస్సార్ పార్టీపై ఆరోపణలు చేయడం స‌రైన‌ పద్ధతి కాదు

న్యూస్ తెలుగు/సాలూరు: మహిళకు న్యాయం చేయాలెని, ఈ ప్రభుత్వం మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహారంపై చర్యలు తీసుకోని,పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్వగృహం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఒంటరి మహిళ పై మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు. శనివారం మంత్రి సంధ్యారాణి వైయస్సార్ పార్టీ పై నా కుటుంబాన్నినా పిల్లలను బయటికి తీస్తున్నారని అంటున్నారని ఈ వ్యవహారంపై వైయస్సార్ పార్టీపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ వ్యవహారంలో వైయస్సార్ పార్టీకి గాని నాకు గాని ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పిఏ చేసిన తప్పులకు మాపై బురద జల్లుడం మానుకోవాలని అన్నారు. ఒంటరి మహిళ భర్త, తండ్రి లేని ఆమెను మానవత్వంతో ఆలోచించకుండా గుమ్మలక్ష్మీపురం అవతల కొండల్లోకి ట్రాన్స్ ఫర్ చేయడం ఇదేనా మానవత్వం అని అన్నారు. ఆమెను సాలూరు దగ్గరలోని బదిలీ చేస్తే ఈ వ్యవహారం ఇంత వరకు వచ్చేది కాదని హైకోర్టు కెళ్లి ఆమె ఆర్డర్ తెచ్చుకుంది అన్నారు. మంత్రి చేసిన నిర్వాహకం వల్ల ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చిందని ఆమెను పిలిచి మాట్లాడితే ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదని అన్నారు. నేను 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండిఏ ఒక్క ఉద్యోగి నైనా బాధపెట్టాన ఒక్కరినైనా తొలగించానా నియోజకవర్గంలో ఉన్న ప్రజలను గాని ఉద్యోగస్తులను గాని అడిగితే తెలుస్తుందని తెలియజేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో 10 నుంచి 15 మంది చిరుద్యోగులను తొలగించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి లోకేష్ మానవత్వంతో ఆలోచించి బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు . మీడియాని మీడియాగా చూడాలని మీరు చేసిన తప్పులకు మీడియాని నిందించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సోషల్ మీడియాలో కొందరు టిడిపి నాయకులు నాపై పోస్టులు పెడుతున్నారని వీరందరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఈ వ్యవహారంలో సాలూరు నియోజకవర్గం రాష్ట్రంలో సంచలనానికి మారుపేరైందని ఇది ఎవరు తెచ్చుకున్నారో నియోజకవర్గ ప్రజలను అడిగితే తెలుస్తుంది అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితురాలుకు న్యాయం జరిగే టట్లు చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, వైయస్సార్ పార్టీ నాయకులు గొర్లె మధుసూదన్ రావు, కాకి రంగ, ఎమ్మెస్ నారాయణ, కొల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. (Story:వైయస్సార్ పార్టీపై ఆరోపణలు చేయడం స‌రైన‌ పద్ధతి కాదు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!