విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రోజురోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం వనపర్తి మండలం చిట్యాల లో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26, ఇన్‌స్పైర్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ పెంచడం కోసం సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేకంగా పుస్తకాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలను కలెక్టర్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి 150 పాఠశాలల నుండి విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 270 వైజ్ఞానిక ప్రజలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి కొత్త కొత్త ఆలోచనలపై దృష్టి సారించి సాంకేతిక రంగంలో ఎదగాలన్నారు. రోజురోజుకు సాంకేతిక పరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. సైన్స్ అంటేనే నిజం అని, సైన్స్ ద్వారా ప్రపంచంలో ప్రకృతిలో దాగి ఉన్న నిజాలను తెలుసుకోవచ్చని చెప్పారు. సైన్స్ ను అలవర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలమని చెప్పారు. ఈరోజు మనం ఇక్కడి నుండే ఇతర గ్రహాల పైన డ్రోన్లను ఆపరేట్ చేయగలుగుతున్నామని అంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందని తెలిపారు. సైన్స్ పై ఆసక్తి పెట్టి విద్యార్థులు పరిశోధనాత్మక విధానంలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి మార్గం సైన్స్ చూపిస్తుందని, అది సృజనాత్మక ఆలోచనలతోనే సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. సాంకేతిక రంగం అభివృద్ది చెందుతుందని, ఈ నేపథ్యంలో కొత్త ఆవిష్కరణల ద్వారా ప్రతీ రంగం అభివృద్ది అంచెలంచెలుగా జరుగుతుందన్నారు. ప్రపంచం ఆధునిక సాంకేతికత వైపు పరుగెడుతుందని, విద్యార్థులు సైన్స్‌లో ప్రతీ అంశాన్ని క్షుణంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి వాటికి సంబంధించి ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కోసం కలెక్టర్ చేస్తున్న కృషిని వివరిస్తూచేస్తున్న కృషిని వివరిస్తూ విద్యాశాఖ వివరిస్తూ అధికారులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, జి సి డి ఓ శుభ లక్ష్మి, చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి, ఇతర విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి)

