కవితల పోటిలో డాక్టర్ కోడూరుకు అరుదైన గౌరవం
శ్రీ శ్రీ కాళావేదిక నిర్వహించిన కవితల పోటీలో టాప్ 10 లో ఒకరిగా సాయి శ్రీనివాస్ కు పురష్కారం
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు పట్టణ శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కోడూరు సాయి శ్రీనివాస్ కు శ్రీశ్రీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలలో అరుదైన పురస్కారం లభించింది.ఈ సందర్భంగా మంగళవారం తనకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని స్థానిక విలేకరులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతు తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎన్నోకథలు,నాటికలు వ్రాసిన తనకు 36 ప్రపంచ రికార్డులు సాధించిన శ్రీ శ్రీ కళావేదిక సంస్థ ద్వారా ఈ పురస్కారం లభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే అతి పెద్ద సాహితి సంస్థగా పేరుపొందిన ఈ కళావేదికలో “అపూర్వ” బాల్యం అనే అంశం పై నిర్వహించిన కవితల పోటీలో టాప్ 10 లో ఒకరిగా నిలవడం గర్వంగా ఉందని ఫీల్ అయ్యారు. అంతేకాకుండా ఈ నెల 30 వ తేదీనా సఖినేటి పల్లెలో జరగబోవు సంస్కృతిక ఉత్సవాల లో అవార్డు ప్రశంస పత్రం అందుతాయని తెలియజేశారు. అలాగే కళావేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు భూషణం.ఈశ్వరమ్మ ఇంకా జాతియ మీడియా నల్లా భాగ్యలక్ష్మి కి ఈ సందర్భముగా కోడూరు కృతజ్ఞతలు తెలిపారు.(Story : కవితల పోటిలో డాక్టర్ కోడూరుకు అరుదైన గౌరవం )

