రోడ్డుపై దాన్యం కుప్పలు వాహనదారుల కుటుంబాల్లో కన్నీరుగా మారొద్దు
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : రోడ్లపై ధాన్యాన్ని పోసి కళ్ళాలుగా మార్చడం వాహనదారుల ప్రాణాలకు నేరుగా ప్రమాదమవుతుంది. రాత్రివేళల్లో ధాన్యం కుప్పలు గుర్తుపట్టలేక, తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై ధాన్యం పోయకుండా, ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ఆరబెట్టాలని రైతులు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజల ప్రాణాలు కాపాడడం అందరి బాధ్యతని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి, సునీత రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం కేవలం నిర్లక్ష్యం కాదు అది ప్రాణాంతకం రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించక, వాహనాలు ధాన్య కుప్పలకు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనందరినీ కలచివేస్తున్నాయి. రోడ్లపై ధాన్యం పోసి కల్లాలుగా మార్చడం వల్ల వాహనదారులు రాత్రి సమయాలలో గమనించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. రైతులు బావుల దగ్గర ఇండ్ల వద్ద లేదా సొంత పొలాల్లో ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ప్రత్యేకంగా కళ్ళాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి వాహన దారులకు ఇబ్బంది కలిగించి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దని రైతులను కోరారు. రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని వాహనదారులు వాటిని డీకొని చనిపోవడం జరుగుతుంది. రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీసు అధికారులు సిబ్బంది గ్రామాలలో రైతులకు విధిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకు రైతులు ప్రజలు సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.(Story : రోడ్డుపై దాన్యం కుప్పలు వాహనదారుల కుటుంబాల్లో కన్నీరుగా మారొద్దు )

