Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన బ్రోచర్‌ ఆవిష్కరించిన  జీవి

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన బ్రోచర్‌ ఆవిష్కరించిన  జీవి

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన బ్రోచర్‌ ఆవిష్కరించిన  జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్, జీవి ఆంజనేయులు తమ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని వినుకొండలోని ఎస్ జి కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెక్‌ పోస్ట్, నూజెండ్ల రోడ్డు వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన కోర్సులకు సంబంధించిన వివరాలను బ్రోచర్‌లో పొందుపరిచారు. డొమెస్టిక్ డేటా ఆపరేటర్ ఈ కోర్సుకు పదో తరగతి మరియు ఆపైన విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ (ఇంటర్) మరియు ఆపైన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నైపుణ్య శిక్షణ పొంది ఉపాధిని పొందాలని జీవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తమ్మాజీరావు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, సిహెచ్ రామాంజనేయులు అడిషన్ డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, జానీ భాష వినుకొండ స్కిల్ హబ్ సమన్వయకర్త లు పాల్గొన్నారు. (Story:నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన బ్రోచర్‌ ఆవిష్కరించిన  జీవి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!