Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎన్ఎస్పి కాలువపై వంతెన ప్రారంభించిన  జీవి..

ఎన్ఎస్పి కాలువపై వంతెన ప్రారంభించిన  జీవి..

ఎన్ఎస్పి కాలువపై వంతెన ప్రారంభించిన  జీవి..

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి పెరుమాళ్ళపల్లి మేజర్ కెనాల్ పై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 20 ఏళ్లకు పైగా నిర్మించిన కాలువపై వంతెన శిధిలావస్థకు చేరి ప్రమాదాన్ని పొంచి ఉందని, చిన్న బ్రిడ్జి కావటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, కొత్తపేట, సిద్ధార్థ నగర్ వాసులతో పాటు పట్టణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గత వైసిపి పాలనలో వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులను అధికారులను,ప్రజలు కోరిన పట్టించుకోలేదని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల నిధులు కేటాయించి కాలువపై పెద్ద వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. వినుకొండ పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అలాగే వంతెనలు అవసరమైన చోట గుర్తించి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. వార్డుల్లో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి శుక్రవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ జరుగుతుందని, ప్రజలకు తాను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టిడిపి,జనసేన, బిజెపి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, పట్టణ టిడిపి అధ్యక్షులు బొంకూరి రోశయ్య, పివి సురేష్ బాబు, క్లస్టర్ ఇన్ చార్జ్ జాని, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. (Story:ఎన్ఎస్పి కాలువపై వంతెన ప్రారంభించిన  జీవి..)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!