అయ్యప్ప స్వామి మహా పడిపూజలో జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని ఏబీఎమ్ కాంపౌండ్ లో లగడపాటి వెంకట్రావు కుమారుడు లగడపాటి అంజయ్య ఇంటి ఆవరణలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మరియు భక్తులు జీవి కి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం భక్తిభావానికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు. (Story:అయ్యప్ప స్వామి మహా పడిపూజలో జీవి)

