హిడ్మా, భార్య రాజే పూవర్తిలో అంత్యక్రియలు పూర్తి
విషాద ఛాయలు నెలకొన్న పువర్తి గ్రామం
అంత్యక్రియలకు అశేషంగా హాజరైన ప్రజలు
50 ఇళ్లకు పైగా తాళాలు
రోదనల తో మారుమోగిన పువర్తి గ్రామం
హి డ్మా మృతి పట్ల కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు

న్యూస్ తెలుగు/చింతూరు :
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మడివి. హిడ్మా, అతని భార్య రాజే తో పాటు మరో నలుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన సంగతి పాఠకులకు విదితమే. రంపచోడవరంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హిడ్మా స్వగ్రామమైన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పువర్తి గ్రామంలోని సిఆర్పిఎఫ్ క్యాంపుకు గురువారం మృతదేహాలను తరలించారు.హిడ్మా, అతని భార్య రాజే మృతి చెందటం తో పూవర్తిలో విషాదఛాయల అలముకున్నాయి. గ్రామంలో50 ఇళ్లకు పైగానే తాళాలు వేశారు. సిఆర్పిఎఫ్ క్యాంపులో ఉన్న మృతదేహాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లారు.హిడ్మా లేవడానికి ఓపిక లేని హిడ్మా తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.పూవర్తి బంధువుల రోదనలతో మిన్నంటి పోయాయి. 50 పైగా ఇళ్ళు ఉన్న పూవర్తి గ్రామంలో 80 మంది పైగా యువకులను మావోయిస్టులుగా హిడ్మా మార్చి వేశాడు. గురువారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు తో హిడ్మా, రాజే ల అంత్యక్రియలు జరిగాయి. అంత్య క్రియలు జరగటంతో గురువారంతో హిడ్మా శకం పూర్తి అయిందని చెప్పవచ్చు. (Story:హిడ్మా, భార్య రాజే పూవర్తిలో అంత్యక్రియలు పూర్తి)

