చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
న్యూస్ తెలుగు / చింతూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం మరియు జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో 150 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె రత్న మాణిక్యం తెలియజేశారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లాండులో బారిష్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారనీ, దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను కూడా చేపట్టారన్నారు . భారతదేశంలోని మొదటి భారత ఉప ప్రధానమంత్రిగాను, హోం శాఖ మంత్రిగా పనిచేశారన్నారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని, ఆయన 562 సంస్థాలను భారతదేశంలోకి ఐక్యం చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచారన్నారు, గుజరాత్ లో 182 మీటర్ల ఎత్తుగల విగ్రహం ఏర్పాటు చేశారన్నారు.చరిత్ర విభాగాధిపతి బి. శ్రీనివాస రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగం రూపొందించడంలో భాధ్యత వహించారన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి. వెంకట్రావు,డా.వై పద్మ, జి.హారతి,ఎస్ అప్పనమ్మ, డా.కె.శకుంతల,కె.శైలజ, ఎం.నాగ మోహన్ రావు, జి. సాయికుమార్ , ఆర్.మౌనిక, పి.మోనిక, ఎన్ ఆనంద్ ,కె.లక్ష్మి ప్రసన్న కమారి, కీర్తి అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది , విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

