రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలి
– ఎరువుల బ్లాక్ మార్కెట్లో తరలించిన, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు
– వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు తో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రైతులకు కావలసిన యూరియా, డిఏపి ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఆయన దృష్టికి వచ్చిన ఎరువుల సమస్యలపై శుక్రవారం వ్యవసాయ కమిషనర్ ఢిల్లీ రావు, DAO జగ్గారావులతో చీఫ్ విప్ జీవీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. రైతు పంట సాగు అవసరాన్ని బట్టి ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీ వద్ద ఎరువులు తీసుకోవడానికి వచ్చిన రైతులకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలించిన, అధిక ధరలకు విక్రయించిన, ఒకరికి ఎక్కువ మొత్తంలో ఎరువులు ఇచ్చిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ఇక్కడ రైతులు కావాల్సిన ఎరువులు కొరత లేకుండా పంట సాగు చేసుకునే ప్రతి రైతుకు అవసరాన్ని బట్టి ఎరువులు అందించాలన్నారు. అనంతరం వినుకొండ నియోజకవర్గం లోని సొసైటీ సిఈఓ లతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియోజకవర్గంలోని సొసైటీలో రైతులకు ఎరువులు అందించాలని అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సొసైటీ పరిధిలోని రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story:రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలి)

