Homeవార్తలుతెలంగాణఅక్కన్నపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అక్కన్నపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అక్కన్నపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

 


న్యూస్ తెలుగు / సిద్దిపేట జిల్లా : అక్కన్నపేట మండలం వ్యాపితంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాటు చేసిన బతుకమ్మలు ఆడి బతుకమ్మలను చెరువుల్లో, వాగుల్లో నిమజ్జనం చేశారు.
అక్కన్నపేట మండల కేంద్రంలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు.గ్రామాల్లోని కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడిపాడారు.బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడలు ఉ య్యాలో.. గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. యువతులు, మహిళలు, చిన్నారులు దాండియా, కోలాటాలు ఆడారు. పల్లెలు పూల వనాన్ని తలపించాయి. అనంతరం గ్రామ శివారుల్లోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంపిడివో జయరాం నాయక్, ఎస్సై చాతరాజు ప్రశాంత్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సాంప్రదాయ బద్ధంగా పాడుతూ…


మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆలయాలు, ముఖ్య కూడళ్లు, కమ్యూనిటీ భవనాల వద్ద మహిళలలు, చిన్నారులు రంగు రంగుల పూలతో అంలకరించిన బతుకమ్మలను పెట్టి డిజేల పాటలకు స్వస్తి పలికి సాంప్రదాయ పద్ధతిలో లయబద్ధంగా పాటలు పాడుతూ, ఆటలు ఆడటం విశేషంగా ఆకట్టుకుంది.

అక్కన్నపేటలో చీరల కానుక:


వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఉట్టి పడిన తెలంగాణ సంస్కృతి…
అక్కన్నపేటలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో చూపరులను విశేషంగా ఆకట్టుకునేలా మహిళలు తిరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆట, పాటలతో పూజించడం జరిగింది. చేనులో దొరికే గునుగు పూలు, తంగేడు, టేకు ,పట్టు కుచ్చులు, గుమ్మడిపూలు, బంతిపూలు, కట్ల పూలు ఇలా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించారు.ఈ బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను పేర్చిన ముగ్గురు మహిళలకు జి.కే చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వివేకానంద,శివ యూత్ సంయుక్తంగా ట్రస్టు వ్యవస్థాపకులు గొట్టే సదానందం,మహేందర్, చిరంజీవి నేతృత్వంలో పట్టు చీరల్ని కానుకగా అందజేశారు.

ప్రత్యేక కథనం :
నారదాసు ఈశ్వర్
సీనియర్ జర్నలిస్ట్

(Story:అక్కన్నపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!