రూ.10 లక్షలతో అమ్మవారికి అలంకరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ బోసు బొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం ఆలయంలోని మూలవిరాట్ అమ్మవారికి 10 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం శ్రీ రాజరాజేశ్వరి కొలువు తీర్చారు. బాలికలచే ప్రత్యేక భరతనాట్యం మరియు కళ్యాణ మండపం ఆవరణలో 450 మంది మహిళల కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ. వచ్చే నెల 2వ తారీకు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. పది రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమాలు, వివిధ సాంస్కృతి కార్యక్రమాలు, పండగ నాడు సెమీ పూజా కార్యక్రమం అత్యంత వైభవ పేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జి, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ అమర్నాథ్, రెడ్డి నగేష్ బాబు, కోశాధికారి పెండ్యాల సురేష్, కొల్లిపర వెంకట నాగేశ్వరరావు, సదావర్తి సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.(Story:రూ.10 లక్షలతో అమ్మవారికి అలంకరణ)

