సీతం కళాశాలలో బి సి ఏ కోర్సు ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ , సీతం కళాసాల లో బీ.బీ.ఏ,ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ కోర్సుల ప్రారంభోత్సవం,ఓరియంటేషన్ , ప్రవేశ వేడుకలు జరిగాయి .పై కోర్సులపై విద్యార్ధినీ , విద్యార్దులకు వారి తల్లి తండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా బి.గోపి కుమార్ (సీఈఓ, సాంఖ్య టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్,విశాఖపట్నం)
విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీఏ కోర్సు ద్వారా విధ్యార్దులు కంప్యూటర్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపికన్నారు. ఇది నైపుణ్యాలను పెంచుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక అవకాశాలను అందిస్తుందన్నారు. మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్ , మానవ వనరులు వంటి ప్రధాన వ్యాపార రంగాలపై సమగ్ర అవగాహన పొందవచ్చునన్నారు. వ్యాపార సమస్యలను విశ్లేషించడానికి, డేటాను అర్థం చేసుకోవడానికి, పరిమాణాత్మక, గుణాత్మక పద్ధతులను ఉపయోగించి సమాచార నిర్ణయాలు తీసుకునే విద్యార్థులకు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బీబీఎ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.
కళాసాల డైరెక్టర్ డా॥ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ బీబీఏ, బీసీఏ కోర్సు ద్వారా విద్యార్దులకు వ్యాపారానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాజెక్ట్‌లను నిర్వహించడం, వివిధ వ్యాపార సందర్భాలలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను బీబీఏ కోర్సు ద్వారా సీతం కళాసాల లో నేర్చుకోవచ్చన్నారు.బీసీఏ కోర్సు నైపుణ్యాలను పెంచుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక అవకాశాలను అందిస్తుందన్నారు
సీతం ప్రిన్సిపల్ డా॥ ద్వివేదుల రామమూర్తి మాట్లాడుతూ బీబీఏ తరువాత విద్యార్దులకు లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్ కోఆర్డినేషన్ , ప్రపంచ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ఎగుమతి/దిగుమతి కార్యకలాపాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ లలో ఉపాది అవకాశాలు పొందవచ్చునన్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ మెనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డా॥ యస్ వరూధిణీ మాట్లాడుతూ బీబీఏ కోర్సు ద్వారా విద్యార్దులలో వ్యాపార నైపుణ్య అభివృద్ది కోసం బిజినెస్ కమ్యూనికేషన్ క్లబ్స్ , రోల్ ప్లేస్ , బిజినెస్ ఏక్టివిటీస్ , పారిశ్రామిక సందర్శనలు వంటి కార్యక్రమాలను కళాసాల నిర్వహిస్తాదన్నారు.ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు మరియు డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రాధ , ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. (Story:సీతం కళాశాలలో బి సి ఏ కోర్సు ప్రారంభం)

