Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కి జాతీయ సేవ రత్న పురస్కారం

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కి జాతీయ సేవ రత్న పురస్కారం

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కి జాతీయ సేవ రత్న పురస్కారం

న్యూస్ తెలుగు/ వినుకొండ :అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ సర్వీస్ సొసైటీ వారు మూడవ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ అక్కినేని కళకేంద్రం నందు నిర్వహించిన కార్యక్రమం లో భాగంగా వేరు వేరు రాష్ట్రాలలో స్వచ్చందంగా సేవ చేయుచున్న వారికి అవార్డ్స్ అందచేయటం జరిగినది. ఈ కార్యక్రమం లో భాగంగా వినుకొండ కి చెందిన యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు వారు గత కొన్ని సంవత్సరాలుగా చేయుచున్న సేవలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించి వారికి జాతీయ సేవ రత్న అవార్డు అందచేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన యాక్టర్ 30ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడుతూ పృద్వి అతి చిన్న వయసులో వీరు చేస్తున్న సేవలని యువత ఆదర్శంగా తీసుకోని యువత అందరూ సేవ దృక్పధం కలిగి ఉండాలని అన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు మల్లది ప్రసాద్ రావు మాట్లాడుతూ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు గత కొన్ని సంవత్సరములుగా విద్యార్థులకు విద్యకు అవసరమైన ఎగ్జామ్ కిట్లు, పేద పిల్లలకు చేయూత, బలహీన వర్గాల వారికి నిత్యవసర సరుకుల పంపిణీ, ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ వున్నారని ఇలాంటి యువతను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని, వారి సేవలను మేము గుర్తించి వారికి అవార్డు అందించినందుకు గాను మా సంస్థ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉందని ఏం ప్రసాద్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ని కొనియాడారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ యొక్క సేవలను గుర్తించి మాకు జాతీయ సేవ రత్న అవార్డు అందించినందుకు గాను వారి సంస్థ సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటునమని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పృద్వి తనయి యాక్ట్రెస్ శ్రీలు, యాక్ట్రెస్ రజిత శాండే, రిపబ్లిక్ అని పార్టీ జాతీయ అధ్యక్షులు పేరం నాగేశ్వరరావు గౌడ్,సినీ నిర్మాతలు జిలీల్, అలీ ఖాన్,రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా అధ్యక్షులు అయిరేని శ్రావణ కుమార్,తెలంగాణసినిమా యూనియన్ పి ఆర్ ఓ గోంగూర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.(Story:యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కి జాతీయ సేవ రత్న పురస్కారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!