సిరమ్మ చేతుల మీదుగా
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం : పట్టణంలో పాత బస్టాండ్ వద్ద పుట్చలవీధిలో నివసిస్తున్న పాండురంగ జనార్ధన రావుకి వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ అయినందున తాను జీవించుటకు ఉపాధి లేక, తన బ్రతుకుతెరువు కోసం (జీవనోపాధి) కొరకు చిన్న శ్రీను సోల్జర్స్ కార్యాలయాన్నీ ఆశ్రయిoచి తమ సమస్యను తెలుపగా వెంటనే స్పందించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, వై.యస్.ఆర్ .సి.పీ. జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం కాడానికి కావలసిన సామగ్రినీ, తోపుడు బండిని అంధిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ వారికి ఆసరాగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిని పెంచుదాం మంచిని పంచుదాo అనే లక్ష్యంతో ఏర్పాటు అయిన చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ఆర్థికంగా జీవనోపాధి లేని వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోనే ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన తండ్రి ఆశయ సాధన త ఏర్పాటు చేసిన చిన్న శ్రీను సోల్జర్స్ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తమకుతెలపవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో లాయరు అంజనీ కుమార్ , చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, లోకల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:సిరమ్మ చేతుల మీదుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం)

