Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రామా ఫౌండేషన్ ద్వారా అనేక రక్తధాన శిబిరాలు 

రామా ఫౌండేషన్ ద్వారా అనేక రక్తధాన శిబిరాలు 

రామా ఫౌండేషన్ ద్వారా అనేక రక్తధాన శిబిరాలు 

న్యూస్ తెలుగు/ సాలూరు : గురువులపై భక్తి ,కృతజ్ఞతలు పోతున్న కాలంలో గురువు పేరు మీద ఫౌండేషన్ స్థాపించి అనేక సామాజిక సేవా కార్య క్రమాలు చేస్తున్నారు సాలూరు పట్టణానికి చెందిన శివలెంక ప్రసాదరావు మాష్టారు..తన గురువు పట్ల ఆయనకు గల కృతజ్ఞత ఆయన శిష్యులకు మార్గ దర్శకం అయింది.గురువు వి ఠాల రామ చంద్ర మూర్తి మేనమామ రామారావు పేరు మీదగా ఆయన స్థాపించిన రామా ఫౌండేషన్ ఇప్పటి వరకు 5 200 రక్తదానాలు నిర్వహించింది.ఈ మహా యజ్ఞం లో 30 ఏళ్లు కిందట ప్రసాదరావు మాష్టారు దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆయన నిర్వహించే రక్త దాన యజ్ఞంలో పాల్గొని తమ గురు భక్తిని చూపిస్తారు.నిరంతరం తన శిష్యుల ద్వారా రక్త సహాయం అందిస్తుంటారు.ప్రత్యేకంగా ప్రతి సెప్టెంబర్ 5 వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తన శిష్యులతో రక్త దాన శిబిరం నిర్వహిస్తారు. పువ్వు పండు ఇచ్చి టీచర్స్ డే కి శుభాకాంక్షలు చెప్పడం కాదు.ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేసి గురువుల పట్ల కృతజ్ఞతను ఈ విధంగా తెలియ జేయమని కోరుతారు.ఇప్పటి వరకు 14 శిబిరాలను నిర్వహించారు.తెలుగు ఉపాధ్యాయునిగా తను నేర్చుకున్న సాహిత్య విలువలను విద్యార్థుల్లో కలిగించి సామాజిక సేవలో వారిని భాగ స్వాములుగా చేయడం తన ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవం అని పేర్కొంటారు.తన వద్ద విద్య అభ్యసించిన విద్యార్థి చెడు దారులు పట్టకుండా సమాజానికి,తన కుటుంబానికయినా పనికి రావాలి అనేది ఆయన దృక్పథం. తెలుగు మాష్టారుగా తను క్లాసులో పాఠాలు చెప్తున్నప్పుడు వేలాది కవులు రచయితలు తనతో తోడుగా ఉంటారని ఆయన చెప్తారు.(Story :  రామా ఫౌండేషన్ ద్వారా అనేక రక్తధాన శిబిరాలు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments