ఘనంగా కృష్ణవేణి కళాశాలలో గురుపూజోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కృష్ణవేణి కళాశాల వారు స్థానిక నరసరావుపేట రోడ్డులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపం నందు ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని, విద్యార్థులు కళాశాల అధ్యాపకులను దుశ్యాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బి. లింగారావు, మల్లికార్జున రావు, ప్రిన్సిపల్ ఆంజనేయులు మరియు అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story:ఘనంగా కృష్ణవేణి కళాశాలలో గురుపూజోత్సవ వేడుకలు)

