Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో నమస్తే ప్రోగ్రాం

వినుకొండలో నమస్తే ప్రోగ్రాం

వినుకొండలో నమస్తే ప్రోగ్రాం

న్యూస్ తెలుగు /వినుకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే ప్రోగ్రాం అంటే భారత ప్రభుత్వం యొక్క నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పథకం అని అర్థం, ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. నమస్తే ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్ర బోస్, పట్టణ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ కే ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో ఉన్న స్క్రాప్ షాపుల యజమానులకు పురపాలక సంఘ కార్యాలయంలో మీటింగు ఏర్పాటు చేశారు. పట్టణ డంప్ యార్డ్ నందు చెత్త ఏరుకునే వారిని సందర్శించి అవగాహన కల్పించారు. ఈ నమస్తే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్టణంలో వేస్ట్ పికర్స్ చెత్త కుప్పల్లో, రోడ్లు పక్కన మరియు ఇతర ప్రాంతాల్లో కొంతమంది జీవన ఉపాధి కోసం ప్లాస్టిక్ బాటిల్స్, ఇనుము వస్తువులను మరియు ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాళ్ల జీవన ఉపాధి కోసం స్క్రాప్ షాపుల వద్దకు వెళ్లి అమ్మడం జరుగుతుంది. అలాగే రాగ్ పికర్స్ వీరు వీధుల్లో రోడ్డు పక్కన మరియు ఇతర ప్రాంతాల్లో బట్టలు, గోనెలు వంటి వ్యర్థాలను సేకరించి స్క్రాప్ కొట్టులకి అమ్మి జీవనోపాధి కొనసాగిస్తుంటారు. వీరి కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా జీవనాన్ని కొనసాగించిన కార్మికులను సురక్షితమైన, భద్రత కొరకు మరియు గౌరవప్రదంగా గుర్తించి మురికి కాలువల్లో చెత్తకుప్పల్లో మరియు పెద్ద పెద్ద డ్రైనేజీల్లో ఇలా ప్రమాదకరమైన పనులను తగ్గించి యాంత్రిక (మెకనైజ్డ్) పద్ధతులను ప్రోత్సహించడం వీరికి తగిన శిక్షణ అందించడం ద్వారా వారి పనిని సంస్థగతీకరించడం. వెనకబడి ఉన్న వర్గాల నుండి వచ్చిన చాలామంది పారిశుద్ధ్య కార్మికులకు మేలు చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ద్వారా అమల చేయబడుతుందన్నారు. కావున స్క్రాప్ షాపు యజమానులకు తమ వద్దకు ఇలా రోడ్లపై చెత్త కుప్పల్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఏరుకొని వచ్చినా వేస్ట్ పీకర్స్ మరియు రాగ్ పిక్చర్స్ కార్మికులు వచ్చిన వారి బయోడేటా సేకరించి వారి పేరు మరియు అడ్రస్ మున్సిపల్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్ కోరారు. స్క్రాప్ యజమానులు తప్పకుండా వారిని గుర్తించి ఆ కార్మికులకు సహాయపడతారని అన్నారు. (Story:వినుకొండలో నమస్తే ప్రోగ్రాం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!