బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
న్యూస్ తెలుగు/ సాలూరు : బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖా మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని గుమడం గ్రామం 3వ వార్డులో మంత్రి పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అగ్రగామిగా తీసుకుని ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లను ఇంటి వద్దే అందించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామాల్లో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
పెన్షన్ల రూపంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వృద్ధులు, వికలాంగులు,వితంతువులు, ఇతర లబ్ధిదారులకు గొప్ప భరోసానిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ ఇంటి కష్టంలోను తోడుగా ఉండి, వారి కష్టాన్ని తీరుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నిమ్మది తిరుపతిరావు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. (Story:బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం)


