Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, తద్వారా ప్రాణదాతలు కావాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక వై.ఎస్.ఆర్ నగర్ లో ఏబీ ఛారిటబుల్ ట్రస్ట్‌, డి-కింగ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురాన అయ్యలు ముఖ్య అతిధిగా పాల్గొని రక్తదాతలకు అభినందనలు తెలిపి, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్బంగా అయ్యలు మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో
రక్తదాన శిబిరం నిర్వహించడం అభీనందనీయమన్నారు. జిల్లాలో ఎనీమియా, తలసేమియా, సికిల్‌సెల్‌ వంటి సమస్యలు ఉన్నాయని, వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు లేవని అన్నారు. జిల్లాలో రక్త కొరత తీరాలంటే అపోహాలు విడనాడి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన కార్యక్రమంలో పురుషులతో పాటు మహిళలు పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఆరోగ్యవంతు లైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఏబీ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఛైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.శ్వారూప్ , వైఎస్ఆర్ నగర్ జనసేన నాయకులు పిడుగు సతీష్ ,పిడుగు రాజ్యలక్ష్మీ, టిడిపి నేతలు తోట రమేష్, జి.చిట్టి రాజు, వైకాపా నేత తోనంగి రెడ్డి, వై ఎస్ ఆర్ నగర్ యువత దుర్గ ప్రసాద్, బుల్లెట్ శ్రీను
సాయి ,బల్ల గౌరీ శంకర్ , బండారువంశీ ,భాస్కర్ ,విగ్నేష్,చరణ్ ,భాను,వర్ధన్ ,కళ్యాణ్ ,విక్రమ్ ,స్వామి,సందీప్ ,చిట్టి,రవి,జయంత్ ,రాజేష్ , విక్కీ , చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.(Story:రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!