మద్యం దుకాణాలు – ధాబా లలో ఎక్సైజ్ తనిఖీలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వున్న మద్యం దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినుకొండ పట్టణం లోని ఆర్.కె.వైన్స్, సత్యభామ వైన్స్ మరియు శ్రీలక్ష్మి వైన్స్ లను తనిఖీలు చేసి, మద్యంను రసాయనిక పరీక్షకు పంపి పరిశీలించే నిమిత్తం ఒక్కో మద్యం దుకాణం నుండి ఒక్కో మద్యం సీసాను సేకరించి, సీలు వేయడం జరిగింది.దీనికి ముందుగా మద్యం దుకాణాల్లోని మద్యం అమ్మకం ధరలను పరిశీలించే మద్యపాన వినియోగదారుల ద్వారా డెకొయ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. అలాగే వినుకొండ లోని ధాబాలలో మద్యపానం మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వినుకొండ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజు ఇంచార్జి ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ. మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని,ఎం.ఆర్.పి. ధరలకు మద్యం విక్రయించాలని, సమయపాలన పాటించాలని,లేని యడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం అని తెలిపారు. వినుకొండ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ పరిధి లో నాటు సారాయి, అక్రమ మద్యం, మాధక ద్రవ్యాలు మొదలగు నేరముల గురించి ఎలాంటి సమాచారం వున్నా తమకు జలపాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచడం జరుగుతుందన్నారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సి హెచ్. వినీల మరియు సిబ్బంది పాల్గొన్నారు.(Story : మద్యం దుకాణాలు – ధాబా లలో ఎక్సైజ్ తనిఖీలు )

