బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : పలు ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురిని గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరామర్శించారు. తన వ్యక్తిగత వాహన చోదకుడు సంపత్ రెడ్డి గారి తల్లిగారు గత కొంతకాలంగా మెదడుకు సంబంధించిన సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుందిఇందుకు సంబంధించి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారువెల్టూరు కృష్ణారెడ్డి నీ పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం బాధితుల్ని పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , మణిగిళ్ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే )

