గాడి తప్పిన విద్యా వ్యవస్థపై చర్చ గోష్టి
విశాఖపట్నం : జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నం ద్వారకా నగర్ లో గల పౌర గ్రంధాలయంలో గాడి తప్పిన విద్యావ్యవస్థ పై చర్చా గోష్టిని నిర్వహిస్తున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . ఈ చర్చా గోష్టిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పూర్వ ఇంచార్జ్ చైర్మ
న్ ప్రొఫెసర్ కె .ఎస్. చలం , ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు పూర్వ రెక్టార్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎ. ప్రసన్నకుమార్ , ఆదికవి నన్నయ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. నిరూప రాణి , గీతం యూనివర్సిటీ పూర్వ ప్రొ వైస్ ఛాన్సలర్ డి. హరి నారాయణ, మాజీ శాసనమండలి స
భ్యులు పి. వి. ఎన్. మాధవ్ , ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రా ర్ వి. ఉమామహేశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ పి. హరి ప్రకాష్ , ఆంధ్ర యూనివర్సిటీ మానవ వనరుల నిర్వహణ పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కె.జాన్ తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు . ప్రాథమిక విద్యలో అస్తవ్యస్త నిర్ణయాలు ఫలితంగా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పాఠశాలలకు గత 56 నెలలుగా తరలిపోయారని , నీతి అయోగ్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ గతంలో నాణ్యమైన విద్యలో మూడో స్థానంలో ఉండగా నేడు 19వ స్థానానికి చేరిందని, అక్షరాస్యత విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 30వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రతి సంవత్సరం డీఎస్సీ ని నిర్వహించి టీచర్లను నియమిస్తామని పేర్కొన్న జగనన్న ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ని కూడా నిర్వహించలేదని , ఒక టీచర్ను కూడా నియమించలేదని తెలిపారు . ఫీజు రీయింబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు అమలు చెయ్యనందున పేద వర్గాలు ఉన్నత విద్యను పొందలేకపోతున్నారని తెలిపారు . ఎయిడెడ్ విద్యాసంస్థలును నిర్వీర్యము చేస్తుందన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో విద్యా అభిమానులు గాడి తప్పిన విద్యా వ్యవస్థపై జరిగే చర్చ గోష్టిలో పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. (Story: గాడి తప్పిన విద్యా వ్యవస్థపై చర్చ గోష్టి)
See Also: