వైఎస్సార్సీపీ పార్టీ కి ఏజెంట్ గా ఉన్నాడనే కారణంతో కత్తులతో దాడి
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం టి.అన్నారం గ్రామం నందు శనివారం రాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్త, బూత్ ఏజెంట్ వెంకట ప్రసాద్‌పై కత్తులతో టీడీపీ నేతలు దాడి చేయటం దుర్మార్గం అన్నారు. 2024 ఎన్నికల్లో బూత్ ఏజెంట్‌గా ఉండి రిగ్గింగ్ అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాడని, దీని కారణంగా పలుమార్లు ఆయనపై దాడి పన్నాగాలు విఫలమైనప్పటికీ, ఈసారి టీడీపీ నేత రామయోగి, గోపి, నాగేశ్వరరావు అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రసాద్ పొట్ట, చేతిపై తీవ్ర గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. టీడీపీ గుండాలు చనిపోయారని భావించి దుండగులు పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. ప్రసాద్ పై జరిగిన దాడి కూడా ఒక పథకం ప్రకారమే జరిగిందని, గతంలో వినుకొండ పట్టణ నడిబొడ్డులో జరిగిన రషీద్ హత్యలాగే ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ దాడికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, నారా లోకేష్ పూర్తిగా బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. గాయపడిన ప్రసాద్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయనివ్వకుండా ఎమ్మెల్యే ఆంజనేయులు అడ్డుపడ్డారని, ఇది కూటమి పాలనలో జరుగుతున్న రెడ్‌బుక్ హత్యల శృంఖలలో భాగమేనని మండిపడ్డారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలకు నారా లోకేష్ మరియు ఇక్కడ ఉన్న చీప్ విప్ ఆంజనేయులు బాధ్యత వహించాలని అన్నారు. (Story:వైఎస్సార్సీపీ పార్టీ కి ఏజెంట్ గా ఉన్నాడనే కారణంతో కత్తులతో దాడి)

