కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడి పోరాడుతాం
నాలుగవ జిల్లా మహాసభల్లో వక్తలు వెల్లడి
న్యూస్ తెలుగు/ సాలూరు : రాష్ట్రంలో, జిల్లాలో కార్మిక హక్కులపై అణచివేత విgధానాలు అమలు చేసే ప్రభుత్వాలు ఏవైనా కార్మిక ఐక్యత తో వాటిని ఎదుర్కొంటామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది.
పార్వతీపురం మన్యం జిల్లా నాలుగవ మహాసభలు సాలూరు పట్టణం లో జరిగాయి.
మహాసభకు ముందు రాజేశ్వరరావు పార్కు నుండి ర్యాలీ ప్రారంభమై డీలక్స్ సెంటర్ చిన్న బజారు బోసు బొమ్మ మీదుగా డబ్బి వీధి శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపం వరకు ర్యాలీ సాగింది.
మహాసభకు సూచికంగా జెండా ఆవిష్కరణను మునిసిపల్ సీనియర్ నాయకులు నాగవసం శంకర్రావు ఆవిష్కరించారు.
అనంతరం కామ్రేడ్ ఎన్ శంకర్రావు టి శంకర్రావు సంజీవి అధ్యక్షత వర్గంగా మహాసభ ప్రారంభమైంది.
మహాసభకు ముందు మున్సిపల్ యూనియన్ సీనియర్ నాయకులు రాష్ట్ర మాజీ అధ్యక్షులు కామ్రేడ్ జి సుబ్బారావు గారు ,కామ్రేడ్ డేవిడ్ గారు, కామ్రేడ్ లక్ష్మీ దేవma అకాల మరణం చెందారు వారికి మరియు ఇటీవల మృతి చెందిన వారికి మహాసభ ఘనంగా నివాళులర్పించండి.
మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ డి రమణ రావు వై మన్మధరావు కోశాధికారి జి సన్యాసిరావులు మాట్లాడారు.
1. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన అన్ని రకాల హామీలు అన్ని హామీలు అమలు చేయాలని మహాసభ వేదిక డిమాండ్ చేశారు.
2. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపివేశారని వీటి పై భవిష్యత్తులో పోరాడుతామని తెలిపారు.
3. రాష్ట్ర ప్రభుత్వం గత 17 రోజుల సమ్మె కాలంలో చేసుకొను నిర్ణయాలకు జీవోలు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తుందని మహాసభల వేదికగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధపడతామని తెలిపారు.
4. కనీస వేతనం 26,000 చెల్లించాల్సి ఉన్న కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
5. రాష్ట్రంలో పర్మినెంట్ కార్మికులకు నేటి వరకు పిఆర్సి లేదని ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉంటున్నాయని కనీసం యూనిఫామ్ కుట్టు ఛార్జీలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
6. పెరిగిన పట్టణాలకు తగ్గట్టుగా కార్మికుల పెంచాలని చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
7. 12వ పిఆర్సి కమిటీ వెంటనే వేయాలని పిఆర్సి ప్రకటించే వరకు ఐ ఆర్ nu ఇవ్వాలని డిమాండ్ చేశారు.
8. సెప్టెంబరు 13 14 సిఐటియు జిల్లా మహాసభల్లో కార్మిక వర్గ ఐక్య పోరాటాలకు సంబంధించిన కర్తవ్యాన్ని తీసుకుంటామని కార్మికుల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
9. వెనుకబడిన మన్యం జిల్లాకు విధులు కేటాయించి మున్సిపాలిటీలకు కూడా నిధులు వెంటనే ఇవ్వాలని కార్మికుల కు అవసరమైన పనిముట్లు యూనిఫామ్ వర్షాకాల కిట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మహాసభ నివేదికను జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ప్రవేశపెట్టారు.
సోదర సంఘాలైన వ్యవసాయ కార్మిక సంఘం నుండి కామ్రేడ్ ఎం శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరరావు, యుటిఎఫ్ నుండి కామ్రేడ్ కోలక లీల, మహిళా సంఘం కామ్రేడ్ లక్ష్మి, ఆదివాసి గిరిజన సంఘం కామ్రేడ్ జానకిరావు పాల్గొని సందేశాన్ని ఇచ్చారు.
పార్వతీపురం , పాలకొండ, సాలూరు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ కామ్రేడ్ వరదరాజులు శంకర్రావు, కామ్రేడ్ వేణు సంజీవి, కామ్రేడ్ రవి శంకర్రావు పాల్గొని ప్రసంగించారు. (Story:కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలపై తిరగబడి పోరాడుతాం)

