Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన సదస్సు

హాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన సదస్సు

హాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన సదస్సు

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో హెచ్ఐవి /ఎయిడ్స్, మరియు మత్తు పదార్థాల వినియోగం విరమణ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, హాండ్స్ అఫ్ కంపాషన్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కిషోర్ మరియు ఐ సి టి సి కౌన్సిలర్ సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి అవగాహనా కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరు డ్రగ్స్ వినియోగం కి దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా నేరమని తెలియజేసారు. ఐ సి టి సి కౌన్సిలర్ సురేశ్ మాట్లాడుతూ. మన చుట్టూ జరిగే సామాజిక విషయాల పట్ల అవగాహనా కలిగి ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం, హెచ్ఐవి పై పోరాటంలో యువత పాత్ర చాల ముఖ్యమని, యవ్వన దశలో ఉన్న యువత సరియైన లక్ష్యంతో తమ జీవితంలో విజయం సాధించాలని విద్యార్ధిని, విద్యార్ధులను కోరారు. హాండ్స్ అఫ్ కంపాషన్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు పిఎం ఉదయరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు 2 నెలల ఐఇసి ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏబిసి వ్యూహం గురించి, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో అందరూ కలిసి జీవించాలి, మూడ నమ్మకాలు, హెచ్ఐవి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి తెలియజేశారు . ప్రతి ఒక్కరు వారి హెచ్ఐవి స్థితిని తెలుసుకొని ఉండాలని పిలుపు నిచ్చారు. మీకు తెలిసిన విషయాలు ఇతరులకు తెలియజేయటం, చర్చించటం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అపోహలు మరియు అనుమానాలు నిర్మూలించవచ్చని చెప్పటం జరిగింది. ఔట్రీచ్వర్కర్స్ జయలక్ష్మి ,ఆశా, రమేశ్ ,విజయ ,రేహ్మత ,అనుష ,జక్రయ్య పాల్గొనటం జరిగింది.(Story : హాండ్స్ ఆఫ్ కంపాషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన సదస్సు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!