‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేంత రేంజ్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. సలార్ సీజ్ ఫైర్ చిత్రంలో రాధా రమ పాత్ర చేసిన శ్రియా రెడ్డి.. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు…
* ప్రశాంత్ నీల్ సింపుల్‌గా సలార్ గురించి చెప్పినప్పుడు ముందు వద్దన్నాను. కానీ ఆ సమయంలో నేను సినిమాలు చేయకూడదని అనుకున్నాను. అయితే నీల్ మాత్రం తన పట్టు వదల్లేదు. నన్ను నటించాలన్నారు. ఓసారి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకోమని అన్నారు. హీరో ఎవరైనా పర్లేదు. నా క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉండాలని చెప్పాను. లేదు నీ రోల్ చాలా బావుంటుంది నన్ను నమ్ము అన్నారు.
* నిజానికి ఒరిజినల్ స్క్రిప్ట్‌లో నా క్యారెక్టర్ లేదు. అయితే ప్రశాంత్ నీల్గారు సలార్ మీద వర్క్ చేస్తున్నప్పుడు లేడీ విలన్ ఉంటే బావుంటుందని భావించారు.
* నీల్గారికి నా పాత్రను ఏదో విలనీగా, అరుస్తున్నట్లు చూపించాలనే ఉద్దేశం లేదు. విలనిజం టచ్ ఉంటూనే అందంగా కనిపించేలా నా పాత్రను ఆయన డిజైన్ చేసుకున్నారు. ముందు నుంచి అదే విషయాన్ని ఆయన చెబుతూ వచ్చారు.
* రాధా రమ పాత్రను డిజైన్ చేస్తున్నప్పుడు లుక్ పరంగా చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. వెండితో నా అభరణాలు చేయించారు. టాటూ కూడా ఉండాలని అనుకున్నాం. కానీ.. మళ్లీ లుక్ పూర్తి విలనీగా అనిపిస్తుంది. అలా ఉండకూడదు కదా.. అని టాటూ కూడా వద్దనుకున్నాం. సినిమా ఆసాంతం నేను, నీల్ ఎప్పుడూ గట్టిగా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్లం.
* పొగరు సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ నన్ను రాధా రమ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.
* ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. చాలా కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. పృథ్వీరాజ్ సుకుమార్ విషయానికి వస్తే తను కూడా ఎక్కువగా మాట్లాడడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు.
* గేమ్ ఆఫ్ థ్రోన్స్, కెజియఫ్, బాహుబలి సినిమాలను గమనిస్తే వాటి మొదటి భాగాలు ఎవరికీ అర్థం కావు.. సలార్ కూడా అంతే. సలార్ సీజ్ ఫైర్‌లో మేం అసలు కథేంటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నించాం. ఇక సెకండ్ పార్ట్ చూస్తే నెక్ట్స్ రేంజ్లో ఉంటుంది. దాని కోసం వెయిట్ చేయాల్సిందే.
* రాధా రమ పాత్రను చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి అభినందించారు.
* సలార్ సీజ్ ఫైర్‌లో నా పాత్ర పెద్దగా కనిపించదు. సెకండా పార్ట్‌లో ఎక్కువగా కనిపిస్తాను. సలార్ సీజ్ పైర్ ను మించేలా సెకండ్ పార్ట్ ఉంటుంది.
* పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయానికి వస్తే అద్భుతమైన స్క్రిప్ట్ అనే చెబుతాను. ఎమోషనల్ రోలర్ కోస్టర్ మూవీ. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి వంటి గొప్ప నటీనటులు అలరించబోతున్నారు.
* ఓజీ చిత్రంలో నేను నెగటివ్ రోల్ చేయటం లేదు. సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్, పాత్ర గురించి చెప్పను. ఇప్పుడు ఎక్కువ వివరాలు చెప్పలేను. సలార్, ఓజీల్లో చాలా డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాను. ఓజీ తర్వాత రిటైర్డ్ అయిపోతానేమో (నవ్వుతూ..).. నా రోల్ అంత గొప్పగా ఉంటుంది. (Story: ‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2)
See Also:
రెస్పాన్స్ బట్టి డెవిల్కు సీక్వెల్!