Homeవార్తలు“ప్రతి మనిషీ నడమాడే కథ!” ఆర్టికల్ #1

“ప్రతి మనిషీ నడమాడే కథ!” ఆర్టికల్ #1

“ప్రతి మనిషీ నడమాడే కథ!” ఆర్టికల్ #1

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు.

కానీ, ఆదికథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు.

ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో మొదలుపెట్టాడు. 2009లో తమిళంలో వచ్చిన ఈరమ్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో హీరో, విలన్ లేదా సపోర్టింగ్ పాత్ర ఏదైనా ఒకే స్థాయి నైపుణ్యంతో చేయగల వెర్సటైల్ నటుడిగా తన ముద్ర వేశాడు. “నిన్ను కోరి” లో ఆదిని నేను మొట్ట మొదట గమనించాను. ఆయన డిక్షన్, పాత్రకు తాను తెచ్చిన హుందా తనం నన్ను ఆకట్టుకున్నాయి.

మయసభ OTT ఫార్మాట్‌కి మారిన వెంటనే, లీడ్ పాత్రలలో నా మనసుకి తట్టిన మొదటి పేరు ఆది—ఏ సందేహం లేకుండా. స్క్రిప్ట్ పంపి, ఎనిమిది గంటల జూమ్ కాల్‌లో మొత్తం కథ నరేట్ చేసాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి ఆయనను సిద్ధంగా ఉంచాను. చైతన్య రావును ఫైనల్ చేసిన తర్వాత, తాను MSR పాత్రకు సహజంగా ఉంటాడని భావించి, ఆదిని KKN పాత్ర చేయమని రిక్వెస్ట్ చేశాను.

అక్కడ నుంచి ఆదితో పని చేయడం ఒక ఆనందయాత్ర. KKN కారెక్టర్ ఎన్నో పరిమితులు, లేయర్స్ తో నిండిన ఛాలెంజింగ్ రోల్. నత్తి, ఆర్థిక పరిమితులతో పోరాడుతూ, అపరిమితమైన అపరిమైన లక్ష్యాలతో కూడిన పాత్ర. ప్రతి సమస్యని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎదుర్కునే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది KKN పాత్రను ఒక మరాథాన్‌లా తీసుకున్నాడు—ఆ కాలపు రాజకీయ వాతావరణాన్ని గ్రహించి, తన బాడీ లాంగ్వేజ్‌ను దిద్దుకుంటూ, డైలాగ్‌లతోనే కాదు, మాటల మధ్య నిశ్శబ్దంతో కూడా ఎంతో లైఫ్ తీసుకొచ్చాడు.

స్కూల్ పిల్లాడిలా స్క్రిప్ట్ రీడింగ్స్‌లో పాల్గొనడం, నత్తిని అతి జాగ్రత్తగా ప్రదర్శిస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అపారమైన డెడికేషన్ తో ఒక రియల్ లైఫ్ లెజెండ్‌తో పోల్చుకునే KKN పాత్రను అప్రోచ్ చేశారు. ఆదిలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు, అమాయకపు కళ్లు, చైతన్య రావుతో తనకు నిజ జీవితంలో ఉన్న స్నేహం ఈ షోకు గొప్ప ఆస్తిగా మారింది. అతను ఇంప్రూవైజ్ చేసిన చిన్న చిన్న హావభావాలు షోలో అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను సృష్టించాయి.

ఎన్నో ఉదాహరణలనుంచి ఈ రెండూ పంచుకుంటున్నాను:

1. మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని చాచి పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూసే దృశ్యం—ఒక శక్తివంతమైన ట్రైలర్ షాట్‌కి మారింది.
2. నామినేషన్ పేపర్లను తీసుకుంటున్నప్పుడు CBRకు బదులివ్వడంలో, అతని స్టైల్లోనే సమాధానం ముగించే విధంగా డైలాగ్ ఎక్స్టెండ్ చెయ్యడం—ఆ హీరోయిక్ మోమెంట్‌ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది.

ఈ సిరీస్‌కి వచ్చిన విమర్శకుల ప్రశంసలు, దేశవ్యాప్త గుర్తింపు ఆయన కెరీర్ ని ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకు వెళుతుందని, వెళ్ళాలని ఆశిస్తున్నాను. తను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అంబీషస్ పొలిటికల్ డ్రామాకి ముఖచిత్రం. ఈ దీర్ఘ ప్రయాణం—మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూపులు, సగం మట్టికట్టిన స్క్రిప్ట్‌లను తిరస్కరించిన క్రమశిక్షణ—ప్రతి అడుగు విలువైనదని నిరూపించాయి. (Story:“ప్రతి మనిషీ నడమాడే కథ!” ఆర్టికల్ #1)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!