Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరులో వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా..

సాలూరులో వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా..

సాలూరులో వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా..

న్యూస్ తెలుగు /సాలూరు :  సాలూరు పట్టణంలో వాడవాడల ఎగిరిన మువ్వన్నె జెండా. 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నీలకంఠరావు , ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గరుగుబిల్లి రాములమ్మ, సాలూరు రూరల్ సిఐ ఆఫీస్ కార్యాలయంలో రూరల్ సీఐ రామకృష్ణ, టౌన్ పోలీస్ స్టేషన్ లో టౌన్ సి ఐ అప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం స్వాతంత్రం రావాలని ఎందరో మహానుభావులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారు ప్రాణాలు తెగించి పోరాడడం వలన.ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిందని వారందరికీ భారతదేశంలో ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకి జాతీయ జెండాలు పంచుతూ స్వాతంత్రదినోత్సవాన్ని జరుపుకున్నారు. (Story :సాలూరులో వాడవాడలా ఎగిరిన మువ్వన్నెల జెండా..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!